నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 11:10

కవితపై అరెస్ట్ కత్తి వేలాడుతూ ఢిల్లీ మద్యం కేసులో విచారణకు సమన్లు ​​పంపిన ఈడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురికి కష్టాలు పెరగొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా అరెస్ట్ తర్వాత కవితపై అరెస్ట్ కత్తి వేలాడుతున్నది. ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి బుధవారం కవితను ఈడీ విచారణకు పిలిచింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని మార్చి 13 వరకు ED కస్టడీకి మరియు మద్యం వ్యాపారి అమన్‌దీప్ దాల్‌ను మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు ఒక రోజు తర్వాత కవితకు సమన్లు ​​వచ్చాయి. రాష్ట్ర సమితి (BRS) నాయకుడిని CBI ప్రశ్నించింది. ఈ కేసులో డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ఏడు గంటలకు పైగా.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఒకరోజు ముందు ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి 100 కోట్ల రూపాయల లంచం అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పిళ్లైని ఇడి అరెస్టు చేసింది. వ్యాపారవేత్త పిళ్లై రాబిన్ డిస్టిలరీస్ ఎల్‌ఎల్‌పి అనే కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, శాసన మండలి సభ్యురాలు కవిత తదితరులతో సంబంధం ఉన్న మద్యం కార్టెల్ సౌత్ గ్రూప్‌కు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఇడి పేర్కొంది. అరెస్టయిన మద్యం వ్యాపారి సమీర్ మహంద్రు, అతని భార్య గీతిక మహంద్రు మరియు వారి కంపెనీ ఇండోస్పిరిట్ గ్రూప్‌తో కూడా పిళ్లైకి సంబంధం ఉంది.

ఈమేరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడైన కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల సోమవారం కోర్టు నుంచి ఉపశమనం పొందారు. అతను రూస్ అవెన్యూ కోర్టు నుండి బెయిల్ పొందాడు. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ బృందం అరెస్టు చేసినట్లు తెలియజేశారు.

నిజంనిప్పులాంటిది

Mar 08 2023, 09:46

Ambani Driver జీతం ఎంతో తెలుసా? IT ఉద్యోగులకు మించి.. వారందరి కంటే ఎక్కువే!

Ambanis Driver: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి, ఆయన జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల ఆస్తి. ఇక అంబానీ ఇంట్లో పని వారికి కూడా భారీగానే జీతం ఉంటుందని తెలుసు కానీ.. అది ఎంతో కచ్చితంగా తెలియకపోవచ్చు. అయితే.. ఇప్పుడు అంబానీ డ్రైవర్ జీతం చర్చనీయాంశంగా మారింది. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

సెలబ్రిటీల జీవితం గురించి తెలిసిందే. ఈ ఒక్క పదానికి ఉన్న ఆకర్షణే వేరు. వారి లైఫ్‌స్టైల్ మామూలుగా ఉండదు. ఇక వారి దగ్గర పని చేసేవారు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతుంటారు. ఇప్పుడు భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత Driver కూడా అలాగే వార్తల్లోకి ఎక్కారు. అతడి జీవితం గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు ఆ డ్రైవర్ గురించి పలు మీడియాల్లో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక 2017లో అంబానీ వ్యక్తిగత డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షల రూపాయలు అని దానిని బట్టి తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.24 లక్షల వరకు వస్తుంది. ఇంకా అంబానీ ఇంట్లో డ్రైవర్ అంటే.. జీతానికి అదనంగా ఇంకా చాలానే ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ వేరే. వాటి సంగతెందుకు గానీ.. ఐదేళ్ల కిందటే నెలకు రూ.2 లక్షలంటే ఇప్పుడెంత ఉంటుందో.. అదీ Ambani దగ్గర అంటే.. ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది.

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈ స్థాయిలో Salary ఉంటుందని గ్యారెంటీ ఇవ్వలేం. అది కూడా ఎన్నో ఏళ్లు పని చేస్తే గానీ దక్కకపోవచ్చు. దీంతో ఇప్పుడు అంబానీ వ్యక్తిగత డ్రైవర్ వార్తల్లో నిలిచారు. ప్రపంచ కుబేరుడి ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి ఆ పనిలో ఎంతో నైపుణ్యం ఉండాలి. ఇక అంబానీ తన వ్యక్తిగత డ్రైవర్‌ను.. ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ ద్వారా నియమించుకున్నారని ఆ వార్తా కథనాలు వెలువరించాయి.

ప్రముఖులు, దిగ్గజాల దగ్గర పనిచేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో సహా అన్ని నైపుణ్యాలను ఆ కంపెనీలు ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇక లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా వాడాలి? అని కూడా శిక్షణ ఇస్తుంటాయి. ఎలాంటి రోడ్లపై అయినా, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఆ వాహనాన్ని నడిపేలా వీరు తర్ఫీదు పొందుతారు. ఆ డ్రైవర్లతో సహా వంట మనుషులు, గార్డులు, వివిధ సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట.

ఇక ప్రముఖులకు డ్రైవర్లు, వంట మనుషులు, ఇతర సిబ్బంది ఎలా ఉంటారు? వారి జీవితం ఎలా ఉంటుందనేది మనం చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం. సినిమా సెలబ్రిటీల మేనేజర్స్, బాడీ గార్డ్స్, ఆయాల జీతాలు కూడా బయటకు వచ్చాయి. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, Salman Khan వంటి స్టార్ హీరోలు వారి వారి బాడీగార్డ్స్‌కు కోట్లల్లో జీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ దంపతులు.. తమ పిల్లల్ని చూసుకునే ఆయాకు నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తున్నారట. ఇక ఓవర్‌టైమ్ సమయంలో ఇది రూ.1.75 లక్షల వరకు ఉంటుందంట. కొద్దిరోజుల కింద షారుక్ ఖాన్ మేనేజర్ విలాసవంతమైన ఒక ఇంటిని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఆమె ఏడాదికి రూ.7-9 కోట్ల వరకు జీతం తీసుకుంటారని తెలిసింది. ఇక ఆమె ఆస్తుల విలువ రూ.50 కోట్లకుపైమాటే.

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:39

లాలూ కుమార్తె ఇంటికి సీబీఐ.. Land For Job Caseలో మాజీ సీఎంకు ప్రశ్నలు

పట్నా: ఆర్జేడీ(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రశ్నిస్తోంది.

ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విచారణ లాలూ కుమార్తె మీసా భారతి ఇంట్లో జరుగుతోంది..

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA)హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. బీహార్‌ మాజీ సీఎం లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. సోమవారం రబ్రీని ఆమె నివాసంలో ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం లాలూను విచారిస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:38

సాధారణ ఫ్లూనే దేశంలో దడపుట్టిస్తోంది.. తేలికగా తీసుకోవద్దు!

ఢిల్లీ: ప్రస్తుతం దేశంలో విజృంభిస్తోంది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా..

కరోనా కాకున్నా ఆ వైరస్‌లానే H3N2 ఇన్‌ఫ్లూయెంజా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరిస్తున్నారాయన. పండుల సీజన్‌ వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారాయన. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..

ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాస్కులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలను పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన చెప్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్‌ వాడొద్దని ఇదివరకే ఐసీఎంఆర్‌ ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. వృద్ధులు, చిన్నారులతో పాటుగా గుండె, కిడ్నీ, ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:36

Smuggling: బోటులో డ్రగ్స్.. చెరువులో బంగారు బిస్కెట్లు..

Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు.

కోస్ట్ గార్డ్స్ గుజరాత్ తీరంలో సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న సమంలో ఓఖా తీరానికి దాదాపుగా 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఓ పడవ అనుమానాస్పదంగా ఉందని గమనించారు. కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చేస్తుండగా, వెంబడించి పట్టుకున్నారు.

చెరువులో బంగారు బిస్కెట్లు..

పశ్చిమ బెంగాల్ లోని నాడియా జిల్లాల్లో కళ్యాణి సరిహద్దు ఔట్ పోస్టు ప్రాంతంలోని చెరువులో సుమారు రూ. 2.57 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను బీఎస్ఎఫ్ సోమవారం స్వాధీనం చేసుకుంది. విశ్వసనీయ సమచారం రావడంతో బీఎస్ఎఫ్ చెరువులో తనిఖీ చేపట్టింది. సుమారుగా 40 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ. 2.57 కోట్ల ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది. కొన్ని నెలల క్రితం ఓ స్లగ్మర్ చెరువులోకి దూకి బంగారం దాచిపెట్టినట్లు తెలిపారు. అదును చూసి బంగారాన్ని తీసేందుకు స్మగ్లర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 14:33

Mamata Banerjee: మీరు తల తీసేసినా.. డీఏ మాత్రం పెంచలేను..!

కోల్‌కతా: కరవు భత్యం(DA) పెంపు కోసం రాష్ట్ర ఉద్యోగులు చేస్తోన్న నిరసనపై పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అసహనం వ్యక్తం చేశారు..

ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రంలో కూడా డీఏను పెంచాలని ఉద్యోగులకు మద్దతుగా విపక్ష పార్టీలైన భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

'వారు తరచూ డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతమున్నదానికంటే పెంచడం కుదరదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి..? ఆ పెంపుతో మీరు సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి' అని మమత(Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల బెంగాల్‌(West Bengal) ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదనంగా మూడు శాతం డీఏ పెంపును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నుంచి ఇది అమలవుతుందని అందులో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డీఏతో సమానంగా తమకు ఇవ్వాలంటూ ఉద్యోగులు చేస్తోన్న నిరసనకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుండటంపై మమత మండిపడ్డారు. 'కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్ వేర్వేరు. వేతనంతో కూడిన ఇన్ని సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చుచేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరెందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్‌ ధర చూడండి ఎంతుందో..? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి' అని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు..

నిజంనిప్పులాంటిది

Mar 07 2023, 13:30

పార్టీ కార్యకర్తకు ఆర్థిక సహాయం : శేపూరి రవీందర్

•కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాము : పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వనిపాకల గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అండగా నిలిచిన బిజెపి నాయకులు, వనిపాకల బూత్ కమిటీ అధ్యక్షుడికి యాక్సిడెంట్ అయ్యి కాలు తొడ బాగం విరిగి ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న అక్కెనపల్లి అనిల్ గారిని పరామర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు అందజేసిన 5000 రూపాయలను బిజెపి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తకు ఏ కష్టం ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటాను అనే భరోసాతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

ఇట్టి ఆర్థిక సహాయాన్ని బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారు అనిల్ గారికి అందజేయడం జరిగింది. నకిరేకల్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ సీనియర్ నాయకులు చిక్కుల మెట్ల అశోక్ శక్తి కేంద్రం ఇంచార్జ్ పీకే వెంకన్న జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నగేష్ నడికుడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 18:45

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేతలు.. అరెస్ట్ చేయాలని డిమాండ్..

•మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్

తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పైన దుర్భాషలాడిన,సంపుతానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

సోమవారం డాక్టర్ చెరుకు సవాహస్ మాజీ జిడ్పిటిసి తండు సైదులు గౌడ్,కాంగ్రెస్ ఎస్సి.సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్,బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ తో కలిసి జిల్లా ఎస్పీ గారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై పిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయలేదని అతని అరెస్టు చేయలేదని అందుకే జిల్లా ఎస్పీని కలిసి విన్నవించామన్నారు.

తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరెస్ట్ చేసి చెరుకు సుధాకర్ కు చెరుకు సుధాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వనితనం వెంకట్ రెడ్డి ది అన్నారు.చెరుకు సుధాకర్ కు పిసిసి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిట్టకనే ఈ తథంగానికి తెరలేపారు అన్నాడు. ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి నీతి నిజాయితీ విలువలు లేకుండా అహంభావంతో అహంకారపూరితంగా ఒక ఉద్యమకారునిపై మాట్లాడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా స్పందించాలన్నారు. వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి చెరుకు సుధాకర్ నన్ను తిట్టాడని ఊరికే పదేపదే అనడం కంటే ఏమన్నాడో మీడియా ముందు రుజువు చేయాలని డిమాండ్ చేశాడు. నీ చిల్లర మాటలు ప్రజలు గమనిస్తున్నారని నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ చెరుకు సువాస్ మాట్లాడుతూ మా కుటుంబానికి వెంకటరెడ్డి నుండి ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తక్షణమే అరెస్టు చేయాలని కూడా కోరడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, తెలంగాణ గౌడ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్,గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డే బోయిన సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్,బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, శ్రీ గౌడ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ యూసూఫ్,జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 08:51

Viveka Case: ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి అవినాష్ రెడ్డి..

దీనిపై ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు సీబీఐ అధికారులు. ఈరోజు వేంపల్లి మండలంలో గృహసారధుల కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎంపి అవినాష్ రెడ్డి.

వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసిపి సమావేశం జరగనుంది. ఈరోజు కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహంలో సిబిఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 06:40

Yuvagalam-Nara Lokesh: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత..

పీలేరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 35వ రోజు ఉత్సాహంగా సాగింది. ఎంజేఆర్‌ కళాశాల అగ్రహారం వద్ద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది..

అగ్రహారం వద్ద తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పాదయాత్ర పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ దాటాక స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో లోకేశ్‌ పాదయాత్రను చూసి కొందరు వైకాపా కార్యకర్తలు జై జగన్‌ అని నినాదాలు చేశారు. ఇది గమనించిన తెదేపా కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. దీంతో వారు తప్పించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.